జూలై 17–19న చార్లెట్ వేదికగాcమ్యాట్రిమోనీ మీట్& గ్రీట్
TTA: అమెరికాలో అత్యంత వైభవంగా జరగనున్న ‘టీటీఏ మెగా కన్వెన్షన్ 2026’ (TTA Mega Convention 2026) మహాసభల వేదికగా ఒక అద్భుతమైన ఆత్మీయ అనుబంధ వేదికకు తెరలేచింది. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో నూతన వధూవరుల పరిచయాల కోసం ‘మూడు ముళ్ల అనుబంధం… TTA Matrimony తో ఆరంభం’ అనే నినాదంతో ప్రత్యేక ‘మ్యాట్రిమోనీ మీట్ & గ్రీట్’ (Matrimony Meet & Greet) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
వేదిక..
జూలై 17 నుండి జూలై 19 వరకు ఉత్తర కరొలినాలోని చార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మెగా కన్వెన్షన్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా మ్యాట్రిమోనీ కమిటీని రంగంలోకి దించారు. ఈ కమిటీకి చైర్‌గా ఊషా రెడ్డి మన్నెం (Usha Reddy Mannem), కో-చైర్స్‌గా హరి చరణ్ బొబ్బిలి (Hari Charan Bobbili), అరుణ క్రాంతి (Aruna Kranthi), మహేష్ వక్కల (Mahesh Vakkala), సుప్రియ రెడ్డి (Supriya Reddy), మెంబర్‌గా మనీష్ కుమార్ మొతుకూర్ (Manish Kumar Mothukur) వ్యవహరిస్తున్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణం..
ఈ వేదిక ద్వారా తెలుగు సింగిల్స్, వివిధ వృత్తుల్లో ఉన్న ప్రొఫెషనల్స్, అన్ని వయసుల గ్రూపుల వారు, వివాహ సంబంధాల కోసం చూస్తున్న కుటుంబాలను ఒకే చోటికి తీసుకురానున్నారు. ఎలాంటి దళారులు (Agents) లేకుండా నేరుగా ఒకరినొకరు సంప్రదించే అవకాశం కల్పిస్తున్నారు. ఆత్మీయ పరిచయాలు, ఐస్‌బ్రేకర్ యాక్టివిటీస్, సోషల్ మిక్సర్స్ , ప్రైవేట్ ఇంటరాక్షన్ రూమ్స్ వంటి సౌకర్యాలతో కుటుంబ సమేతంగా పాల్గొనేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో దీనిని రూపొందించారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ మ్యాట్రిమోనీ మీట్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల వారు https://tinyurl.com/TTAMatrimony2026 లింక్ ద్వారా లేదా పోస్టర్‌లోని క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం matrimonial.inbox@ttaconvention.org ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు తెలుగు కుటుంబాలకు సాదర ఆహ్వానం పలుకుతున్నారు.
ఇవి కూడా చదవండి







