జాన్వీ చెప్తున్న బెస్ట్ వెయిట్ లాస్ టిప్ ఏంటంటే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) జంటగా నటించిన భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది(Peddi) రిలీజ్ కు సిద్ధమవుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను జెట్ స్పీడ్‌లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ మీట్లో జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రెస్ మీట్ సందర్భంగా యాంకర్ జాన్వీ కపూర్‌ను బెస్ట్ వెయిట్ లాస్ టిప్ చెప్పమని అడగ్గా, దానికి జాన్వీ వెంటనే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. రామ్ చరణ్ సర్‌తో ఓ సాంగ్ చేయండి, సగం రోజులోనే సన్నబడిపోతారంటూ నవ్వుతూ చెప్పింది. ఆమె సమాధానంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. ముఖ్యంగా రామ్ చరణ్ డ్యాన్స్ ఎనర్జీ, రిహార్సల్స్‌లో ఆయన చూపించే పర్ఫెక్షన్ గురించి జాన్వీ సరదాగా చెప్పిన ఈ వ్యాఖ్యలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికే పెద్ది సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా(Buchi babu Sana) తెరకెక్కిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రాబోతుందని సమాచారం. రామ్ చరణ్ కొత్త లుక్, జాన్వీ కపూర్ గ్లామర్, భారీ నిర్మాణ విలువలు సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాయి. తాజాగా జాన్వీ చేసిన ఫన్నీ కామెంట్స్‌తో మూవీ ప్రమోషన్స్‌కు మరింత బజ్ ఏర్పడింది.







