గ్రీన్ కార్డ్ నిబంధనలపై నిరసనలు..!
అమెరికాలో ఉంటున్న తాత్కాలిక వలసదారులు స్వదేశాలకు వెళ్లి గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చట్ట నిబంధనలను పాటిస్తూ చేసుకున్న దరఖాస్తులపై నిర్ణయాన్ని పూర్తిగా అధికారుల విచక్షణకు వదిలేయడమేంటని చట్టసభ సభ్యులతోపాటు న్యాయ నిపుణులు మండిపడుతున్నారు. ఇది నిర్లక్ష్యపూరిత, తప్పుడు నిర్ణయమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇది చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా అనే ప్రశ్నతో పాటు… భారత్‌తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో దౌత్యపరమైన ఒత్తిడి పెంచటంలో భాగంగా ట్రంప్ సర్కారు తీసుకున్న ఎత్తుగడా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తాజా నిబంధన.. అమెరికాలోని 12 లక్షల భారతీయ కుటుంబాలపై ప్రభావం చూపే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
హెచ్1బీ, ఎల్1 వీసాదారులకు.. :
వలసేతర కేటగిరీలో ద్వంద్వ ఉద్దేశంతో చట్టబద్ధ స్టేటస్‌ను కొనసాగించినప్పటికీ అదొక్కటే గ్రీన్ కార్డు దరఖాస్తుకు సరిపోదు. ఈ ఒక్క కారణంతో విచక్షణను ఉపయోగించి అనుకూల నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. అంటే సుదీర్ఘకాలంగా అమెరికాలో ఉంటున్నామన్న కారణంతో ‘అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్’కు దరఖాస్తు చేసుకోలేరు.
ఇవి కూడా చదవండి
అది ఆటోమేటిక్‌గా, పరిపాలనాపరమైన సాధారణ ప్రక్రియ ఇక ఎంత మాత్రం కాదు. ఇక నుంచీ అడ్జస్ట్ స్టేటస్ దరఖాస్తుకు ఉన్న అర్హతలను అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. పన్నుల చరిత్ర, కుటుంబ పరిస్థితులు, కెరీర్ పురోగతి, ఇతర సాక్ష్యాలను వారు చూడాలి.
ఎఫ్1:
ఎఫ్1 అనేది ద్వంద్వ ఉద్దేశ వీసా కాదు. ఒకవేళ విద్యార్థి అక్కడే పీహెచ్డీ పూర్తి చేసి స్టెమ్ ఓపీటీలో ఉండి ‘స్టేటస్’కు దరఖాస్తు చేసుకుని, అది జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉందని నిరూపించుకుంటే ఆ విద్యార్థి గ్రీన్ కార్డుకు గట్టి దరఖాస్తుదారు అవుతారు.
ఈబీ2, ఈబీ3: ఈబీ2, ఈబీ3 బ్యాక్‌లాగ్‌లో ఉన్న ఉద్యోగులు..
దశాబ్దకాలంగా వెయిటింగ్లో ఉండి ఉంటే.. ఆ ఉద్యోగి అమెరికాలో ఉండి దరఖాస్తు చేసుకుంటే బలమైన ఆధారాలను చూపాల్సి ఉంటుంది. అమెరికాతో సానుకూల సంబంధాలున్నాయని, సుదీర్ఘ ఉద్యోగ అనుభవముందని, పిల్లలు అక్కడే పెరిగారని నిరూపించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి







