ఉక్రెయిన్ పైకి రష్యా హైపర్ సోనిక్ క్షిపణులు..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సంవత్సరాల తరబడి సాగుతోంది. రష్యా భీకర అస్త్రాలతో కీవ్ పై విరుచుకుపడుతోంది.అయినా తట్టుకుని పోరాటం చేస్తోంది కీవ్. దీంతో ఎప్పటికప్పుడు కొత్త అస్త్రాలను అమ్ముల పొది నుంచి బయటకు తీసి ప్రయోగిస్తోంది. ఫలితంగా ఉక్రెయిన్ లో ప్రాణ నష్టం అమాంతం పెరిగిపోతోంది.
లేటెస్టుగా..ఉక్రెయిన్ రాజధాని కీవ్ రీజియన్‌పై డ్రోన్లు, క్షిపణితో రష్యా (Russia) మరోసారి విరుచుకుపడింది. బిలా సెర్క్వా నగరంపై ఆదివారం ఉదయం జరిపిన దాడిలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దాడి కారణంగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గడిచిన నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఈ ఆయుధాన్ని ఉపయోగించడం ఇది మూడోసారి మాత్రమే కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ (Volodymyr zelenskyy) తీవ్రంగా మండిపడ్డారు. సాధారణ పౌరులే లక్ష్యంగా రష్యా భారీ డ్రోన్, క్షిపణి దాడులకు తెగబడిందని.. అందులో శక్తిమంతమైన హైపర్ సోనిక్ ‘ఒరెష్నిక్’ క్షిపణులను ప్రయోగిస్తోందని ఆరోపించారు. అయితే, దీనిపై ఇప్పటి వరకు రష్యా స్పందించలేదు.
ఏమిటీ ఒరెష్నిక్ క్షిపణి..?
ఒరెష్నిక్ అనేది హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి. రష్యా అత్యాధునిక క్షిపణుల్లో ఒకటైన ఈ మిస్సైల్.. గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే ధ్వని వేగం కంటే 10 రెట్లు వేగంగా దూసుకెళ్తుంది. ఈ క్షిపణి అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు.
యూరప్‌లోని అన్ని దేశాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయని , దీన్ని అడ్డుకునే సామర్థ్యం గల ఆయుధమేదీ లేదని రష్యా గతంలో ప్రకటించింది. తొలిసారిగా దీనిని 2024 నవంబరులో ఉక్రెయిన్ నగరమైన డినిప్రోలోని ఓ ఫ్యాక్టరీ మీద రష్యా ప్రయోగించింది. అప్పట్లో అది అభివృద్ధి దశలోనే ఉంది. ఇటీవలే దీన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు సమాచారం. ఉక్రెయిన్‌లోని పశ్చిమ లీవ్ ప్రాంతంలో రష్యా రెండోసారి ఈ క్షిపణి ఉపయోగించగా.. తాజాగా కీవ్ రీజియన్‌పై మూడోసారి ప్రయోగించింది.
ఇవి కూడా చదవండి







