నేను తెలివైన నియంతనే : ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ .. కొన్ని విషయాలను చాలా సులభంగా అంగీకరిస్తారు. అది ఎంత ప్రభావ వంతమైనదైనా ఆయనకు నచ్చితే చాలు.. గుడ్డిగా తల ఊపేస్తారు. ఇందుకు నిదర్శనం.. తన మద్దతుదారులకు ట్రంప్ ఇచ్చిన పిలుపే . తనను దద్దమ్మగా కాకుండా తెలివైన నియంతగా గుర్తించాలన్నారు ట్రంప్.
అంతేకాదు.. తనను విమర్శకులు దద్దమ్మగా అభివర్ణించడం తప్పు అని నిరూపించడానికి తనపై వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా డాక్టర్ను కోరానని తెలిపారు. శుక్రవారం తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ‘‘మీకు తారసపడిన అత్యంత తెలివైన వ్యక్తిని నేనే’’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ‘‘నాలాంటి తెలివైన వ్యక్తి మీకు అధ్యక్షుడిగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా’’ అని ఆయన ప్రశ్నించారు.
ధరల నియంత్రణపై ఏర్పాటైన ఈ సభలో ట్రంప్ తన మానసిక ఆరోగ్యాన్ని గురించి డాక్టర్తో జరిగిన సంభాషణను ప్రస్తావించారు. ‘‘విమర్శకులు నేను దద్దమ్మను అంటూ తూలనాడుతుంటారు. తెలివైన నియంత అని పిలిపించుకోడానికి నాకు అభ్యంతరం లేదు కానీ, దద్దమ్మ అనే మాటే నాకు సరిపడదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మానసిక పరీక్ష చేయించుకోవాలి. అదే జరిగితే ఒబామా, నిద్రమత్తు బైడెన్ వంటి వారు అధ్యక్షులై ప్రజల్ని ఆశ్చర్యంలో ముంచెత్తరు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి







