చీరకట్టులో మెరిసిపోతున్న మానస వారణాసి
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మానస వారణాసి(Manasa Varanasi) దేవకీ నందన వాసుదేవ(Devaki Nandana vasudeva) సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తన ట్రెడిషనల్ గ్రేస్‌తో కుర్రాళ్ల గుండెలను కొల్లగొడుతోంది. రీసెంట్గా రిలీజైన కపుల్ ఫ్రెండ్లీ(Couple Frindly) సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ అందాల భామ, సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోషూట్ ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోల్లో ఆమె లైట్‌వెయిట్ శారీ డ్రేప్‌లో దేవకన్యను తలపిస్తోంది. ఇక ప్లెయిన్ వైట్ స్లీవ్‌లెస్, హై-నెక్ బ్లౌజ్‌తో రూపొందించిన ఈ కాంబినేషన్ ఎంతో క్లాసీ అండ్ ఫ్రెష్ లుక్‌ని ఇచ్చింది. ఎక్కువ హడావుడి లేకుండా మినిమల్ టచ్‌తో ఆమె చేసిన ఈ ఫొటోషూట్ అందరినీ ఆకట్టుకుంటోంది. సంప్రదాయబద్ధమైన సిల్వర్ ఝుంకాలు, చేతికి ఒక సన్నటి బ్రాస్లెట్ మాత్రమే ధరించి తన నేచురల్ అందాన్ని ప్రదర్శించింది.








