సీఎం రేవంత్ రెడ్డితో తమిళనాడు మంత్రి విశ్వనాథన్ భేటీ
ఇటీవల తమిళనాడులో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వనాథన్ (Viswanathan) హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ( ఏఐసీసీ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా సైతం విశ్వనాథన్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మంత్రిగా నియమితులైన తరవాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చి సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి, సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తో భేటీ అయ్యారు. విశ్వనాథ్‌కు మంత్రి పదవి దక్కడంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి







