యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి .. రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి (Sri Lakshmi Narasimha Swamy)ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దర్శించుకున్నారు. అనంతరం రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.43.80 కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాల (Vedic School)కు రేవంత్ శంకస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి (Vijayendra Saraswati)తో కలిసి వేదపాఠశాలకు భూమిపూజ చేశారు. అనంతరం రూ.9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి, రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం పై కప్పు నిర్మాణానికి, రూ.1.35 కోట్లతో నిర్మించనున్న రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి, రూ.43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి,కలెక్టర్ అనురాగ్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.







