అందుకే రెండేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది : మంత్రి అచ్చెన్నాయుడు
రాజారెడ్డి (Raja Reddy) నుంచి వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్య వరకు ప్రతి చావుకూ అంతిమ లబ్ధిదారు జగనేనని, శవాల దగ్గరకెళ్లి దొంగ ఏడుపులేడుస్తూ తనకెవరూ లేరని నటించడం ఆయనకు అలవాటుగా మారింందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) దుయ్యబట్టారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపి (YCP) గొడ్డలి పార్టీ, దానికి సమాజానికి హానికరం అనే ట్యాగ్ లైన్ ఇస్తున్నాం. రాజకీయ ముసుగు వేసుకున్న జగన్‌లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులు అని ధ్వజమెత్తారు. గురువారం జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే అని మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని చిన్నాబిన్నం చేసి, అన్నివర్గాలనూ వేధించారు. కార్యకర్తలు, ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నా. హింసకు హింస సమాధానం కాదని, మంచిపనులు చేసి ప్రజాభిమానం పొందాలని చంద్రబాబు సూచిస్తున్నారు. అందుకే రెండేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది అని పేర్కొన్నారు.







