చక్కర పొంగలి అంటే దక్షిణ భారతీయుల సంప్రదాయ వంటల్లో ఒక ప్రత్యేకమైన స్వీట్. పండుగలు, పూజలు, ప్రత్యేక సందర్భాల్లో దీన్ని ఎంతో ఇష్టంగా తయారు చేస్తారు.
బియ్యం, పచ్చనగపప్పు, చక్కెర, నెయ్యి కలయికతో చేసే ఈ వంటకం తీపి రుచితో అందరినీ ఆకట్టుకుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు.
ముందుగా బియ్యం, పచ్చనగపప్పును కొద్దిగా వేయించి నీటితో పాటు కాస్త పాలను కూడా కలిపి మెత్తగా ఉడికించాలి. దీంతో పొంగలి మరింత రుచిగా తయారవుతుంది.
ఇందులో నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేస్తే రుచి మరింత పెరుగుతుంది. నెయ్యి వాసనే ఈ స్వీట్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
చక్కర పొంగలి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది. పండుగ రోజుల్లో ప్రత్యేకంగా దీనిని ఇంట్లో తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తారు.
దేవాలయాల్లో కూడా చక్కర పొంగలిని ప్రసాదంగా అందిస్తుంటారు. చక్కెర పొంగలి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదంగా భావిస్తారు.
తక్కువ సమయంలోనే సులభంగా తయారయ్యే ఈ స్వీట్ వేడివేడిగా తింటే మరింత టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ స్వీట్ ను ఇష్టంగా తింటారు.