అందరి చూపూ పెద్ది టికెట్ రేట్లపైనే!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది(Peddi) రిలీజ్‌కు ముందే టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా కనిపిస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ భారీ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలకు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని, పెద్దికి రికార్డ్ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాకు జూన్ 3 రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, ప్రీమియర్ షోల కోసం సుమారు రూ.600 వరకు టికెట్ ధర నిర్ణయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుంచి ప్రత్యేక టికెట్ హైక్‌కు అనుమతులు తీసుకునే దిశగా నిర్మాతలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను నిర్మాత వెంకట సతీష్ కిలారు(Venkata Satish Kilaru) అత్యంత భారీ రేట్లకు అమ్మిన నేపథ్యంలో, ఓపెనింగ్స్ చాలా కీలకంగా మారాయి.
ఇప్పటికే ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన రామ్ చరణ్, సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. పెద్దికి ప్రస్తుతం ఉన్న క్రేజ్ చూస్తుంటే, రిలీజ్ రోజునే పలువురు బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల పోటీ లేకపోవడం ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి టికెట్ హైక్స్, ప్రీమియర్ షోల అధికారిక ప్రకటనలపైనే నిలిచింది.







