TLCA ట్రస్టీల బోర్డు నూతన కార్యవర్గం ప్రకటన
TLCA: తెలుగు లీగ్ ఆఫ్ సెంట్రల్ అర్కాన్సాస్ (TLCA) ట్రస్టీల బోర్డు (Board of Trustees) కు సంబంధించిన 2026 నూతన కార్యవర్గ సభ్యుల వివరాలను అధికారికంగా ప్రకటించారు. సంస్థను మరింత సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు అనుభవజ్ఞులైన ప్రముఖులతో ఈ కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నూతన బోర్డుకు చైర్మన్‌గా వి. నాగేంద్ర గుప్తా ఎంపిక కాగా, వైస్ చైర్మన్‌గా రావు వోలేటి, సెక్రటరీగా తిరుమల రావు తిపిర్నేని, ట్రెజరర్‌గా డా. జగ్గా రావు అల్లూరి , ఇమ్మీడియట్ పాస్ట్ చైర్‌వుమన్‌గా రాజి కుంచం బాధ్యతలు చేపట్టారు.
కీలక బాధ్యతలు..
ఈ కార్యవర్గంతో పాటు బోర్డులో కీలక బాధ్యతలు నిర్వహించబోయే సభ్యులుగా డా. మోహన్ బాధే, డా. కృష్ణ రెడ్డి గుజవర్తి, డా. పూర్ణ అట్లూరి, కృష్ణ మద్దిపాట్ల, వెంకటేష్ ముత్యాల, డా. రాఘవ రావు పొలవరపు, నెహ్రూ ఇ. చెరుకుపల్లి, డా. జగ్గా రావు అల్లూరి, ఐ. వి. రెడ్డి, నిర్మల శాస్త్రి, సురేష్ కొండబోలు, ఉదయ్ దొమ్మరాజు, , డా. అంకినీడు ప్రసాద్ వ్యవహరించనున్నారు. నూతనంగా ఎన్నికైన ఈ కార్యవర్గానికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
నామినేషన్ విధానం..
మరో ముఖ్యమైన ప్రకటనలో, 01-24-2026న ఆమోదం పొందిన తాజా TLCA రాజ్యాంగం , బైలాస్ ప్రకారం.. 31 డిసెంబర్ 2027 వరకు పదవీ కాలం ఉండేలా ఒక అదనపు ‘ఎలెక్టెడ్ ట్రస్టీ’ (Elected Trustee) పదవి ఖాళీగా ఉందని బోర్డు తెలిపింది. దీనితో పాటు ఇద్దరు నూతన ‘లైఫ్ ట్రస్టీల’ను (Life Trustees) కూడా ఈ సమయంలో ఎంపిక చేయనున్నారు. ఆసక్తి గల TLCA సభ్యులు దీనికి సంబంధించిన నామినేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి, ఫారంలో సూచించిన ఈమెయిల్ ఐడీకి పంపించవలసిందిగా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (BOT) సెక్రటరీ తిరుమల రావు తిపిర్నేని కోరారు.
ఫామ్ ఫిలప్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి







