రెహమాన్ ను తక్కువ అంచనా చేయడానికి లేదంటున్న బుచ్చి
టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న పెద్ది ఒకటి. డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చినా, ఓ వర్గం ఆడియన్స్ నుంచి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంచనాలకు తగ్గట్టుగా లేదంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(A. R. Rahman) అందించిన మ్యూజిక్‌పై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే ఈ విమర్శలకు దర్శకుడు బుచ్చిబాబు తాజాగా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, పెద్ది కోసం రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని స్పష్టం చేశారు. కొన్ని కీలకమైన సన్నివేశాలు ఆయన సంగీతంతో మరింత ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా మారాయని తెలిపారు. అంతేకాకుండా, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ రూపంలో చెప్పాలనుకున్నా చివరికి ఆగిపోయానని బుచ్చిబాబు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
దీంతో ఇప్పుడు సినిమాపై మరోసారి చర్చ మొదలైంది. ట్రైలర్ ఆధారంగా మాత్రమే రెహమాన్ పనిని తక్కువ అంచనా వేసిన వారికి, సినిమా రిలీజైన తర్వాత అసలు మ్యాజిక్ అర్థమవుతుందని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, భారీ యాక్షన్ బ్లాక్స్‌లో రెహమాన్ స్కోర్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. జూన్ 4న సినిమా రిలీజ్ తర్వాత ఈ డిస్కషన్స్ కు పూర్తిగా ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.







