పెద్దిలో చరణ్ ఫేవరెట్ సీన్ ఏంటంటే
టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్‌లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న పెద్ది ఒకటి. డైరెక్టర్ బుచ్చిబాబు సాన(BuchiBabu Sana) తెరకెక్కిస్తున్న ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ, చరణ్ కొత్త లుక్, మాస్ టచ్ ఉన్న ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ఒక స్పెషల్ ఇంటరాక్షన్‌లో చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆయన సినిమాలోని ఒక స్పెషల్ ఎపిసోడ్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చరణ్ చెప్తున్న దాన్ని బట్టి పెద్దిలో ఢిల్లీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే భాగం సినిమాకు కీలకమైన మలుపు కానుందట. ఆ ట్రాక్ తనకు వ్యక్తిగతంగా చాలా నచ్చిందని, కథ అసలు ఎమోషన్ అక్కడే ఉందని చెప్పాడు. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామాల్లో పోటీ, గెలుపు, మాస్ మూమెంట్స్ ప్రధానంగా ఉంటాయి. కానీ పెద్దిలో మాత్రం ఎమోషన్స్ కూడా సమాన స్థాయిలో ప్రభావం చూపిస్తాయని ఈ కామెంట్స్ సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత కథ పూర్తిగా కొత్త దిశలోకి వెళ్లే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పటి వరకు పెద్దిని కేవలం విలేజ్ మాస్ ఎంటర్టైనర్గా భావించిన ప్రేక్షకుల్లో ఇప్పుడు కొత్త ఆసక్తి మొదలైంది. ఢిల్లీ ఎపిసోడ్ ద్వారా కథకు పాన్ ఇండియా స్కేల్‌తో పాటూ మరింత ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా జోడించబడిందనే టాక్ వినిపిస్తోంది. చరణ్ లాంటి స్టార్ హీరో ప్రత్యేకంగా ఒక భాగాన్ని హైలైట్ చేయడం అరుదుగా జరిగే విషయం కావడంతో, ఆ ట్రాక్‌లో ఏ స్థాయి ట్విస్ట్ లేదా ఎమోషనల్ కనెక్ట్ ఉండబోతుందో అన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది. రిలీజ్‌కు ముందే ఈ స్థాయి చర్చకు దారి తీసిన పెద్ది జూన్ 4న ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి







