సుకుమార్ గారి బ్యాచ్ కు దండం పెట్టాలంటున్న చరణ్
టాలీవుడ్లో డైరెక్టర్ సుకుమార్(Sukumar) రూపొందించిన క్రియేటివ్ స్కూల్ గురించి ఇండస్ట్రీలో ఎప్పుడూ ప్రత్యేక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన వద్ద పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు తర్వాత తమదైన స్టైల్‌తో డైరెక్టర్లుగా నిలబడటం ఆ బ్యాచ్ ప్రత్యేకతగా చెప్పుకుంటారు. ఇప్పుడదే విషయాన్ని స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) సరదాగా ప్రస్తావించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం చరణ్ హీరోగా డైరెక్టర్(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా పెద్ది ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజైన ఓ ఫన్ చిట్‌చాట్ ఈ డిస్కషన్స్ కు కారణమైంది.
కారులో ప్రయాణిస్తూ జరిగిన ఈ సరదా సంభాషణలో పెద్ది కోసం తనపై పడిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒత్తిడిని చరణ్ హాస్యంగా వివరించారు. కథలో ఆటకూలి పాత్రలో కనిపించే తన క్యారెక్టర్‌కు విభిన్న క్రీడలకు తగ్గట్టుగా వేర్వేరు బాడీ లుక్స్ కావాలని డైరెక్టర్ అడిగేవాడని చెప్పారు. ఒక సందర్భంలో క్రికెటర్లా ఫిట్‌గా ఉండాలని, మరో సందర్భంలో రెజ్లర్ మాదిరి బలమైన లుక్ కావాలని చెప్పేవారని చరణ్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఒకేసారి అన్ని రకాల ఫిజికల్ షేడ్స్ ఎలా సాధ్యమవుతాయంటూ ఆయన వేసిన కామెంట్ అభిమానులను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా సుకుమార్ శిష్యుల పని తీరు గురించి చరణ్ చేసిన వ్యాఖ్య ప్రత్యేకంగా హైలైట్ అయింది. పాత్రల విషయంలో డీటైలింగ్, పర్ఫెక్షన్ విషయంలో ఈ బ్యాచ్ ఎంత కఠినంగా ఆలోచిస్తుందో సరదా మాటల్లోనే ఆయన చెప్పిన తీరు ఆకట్టుకుంది. దానికి బుచ్చిబాబు వినయంగా స్పందించగా, మీ గురువుగారే బెటర్ అంటూ చరణ్ ఇచ్చిన ఫన్నీ రిప్లై వీడియోలో మరో హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సంభాషణ అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఇవి కూడా చదవండి







