మరింత జాగ్రత్త పడుతున్న ది ప్యారడైజ్
టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్‌లలో ది ప్యారడైజ్(The Paradise) ఒకటి. నాని(Nani) కెరీర్లోనే భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ రా యాక్షన్ డ్రామాపై ఇండస్ట్రీలో భారీ చర్చ నడుస్తోంది. డైరెక్టర్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆగస్ట్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో ప్రమోషన్ స్ట్రాటజీ విషయంలో మేకర్స్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇటీవల కొన్ని పెద్ద సినిమాల టీజర్లు, గ్లింప్స్ ఆశించిన స్థాయిలో స్పందన అందుకోకపోవడం ఈ టీమ్‌పై కూడా ప్రభావం చూపినట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రేక్షకుల రియాక్షన్స్ ఎలా మారుతున్నాయో గమనిస్తున్న మేకర్స్, తమ కంటెంట్ విషయంలో ఎలాంటి పోలికలు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. గతంలో వచ్చిన మాస్ యాక్షన్ సినిమాల ఛాయలు కనిపిస్తే వెంటనే ట్రోలింగ్ మొదలవుతోందని భావిస్తున్న టీమ్, విజువల్స్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు ప్రతి అంశాన్ని రీచెక్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఆయా షేర్(aaya sher) సాంగ్ మంచి హైప్ తీసుకురావడంతో మ్యూజిక్‌పై కూడా అంచనాలు పెరిగాయి. దీంతో మిగిలిన పాటలు, టీజర్ కట్లు, యాక్షన్ హైలైట్స్ అన్నీ మరింత ఇంపాక్ట్‌తో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తుండటం మరో ప్రధాన ఆకర్షణగా మారింది. నార్త్ మార్కెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రచార కార్యక్రమాలను డిజైన్ చేస్తున్న టీమ్, కేవలం హైప్‌పై కాకుండా కంటెంట్ బలంపైనే ఫోకస్ పెడుతోందట. ముఖ్యంగా ప్రేక్షకుల్లో కొత్తదనం కనిపించాలి గానీ, ఇప్పటికే చూసిన ఫీలింగ్ రాకూడదనే ఆలోచనతో ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌ను జాగ్రత్తగా రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి







