జూన్ 19 నుండి GRTA సమ్మర్ క్యాంపింగ్
GRTA: ప్రవాసాంధ్రులకు ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన సమయాన్ని గడిపేలా గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ (GRTA) ఒక ప్రత్యేకమైన సమ్మర్ క్యాంపింగ్ (Summer Camping) ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. “We Like to Go Camping!” అనే నినాదంతో జూన్ నెలలో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.
జూన్ 19, 20, 21 తేదీల్లో వర్జీనియాలోని ప్రసిద్ధ షెనందో వ్యాలీ క్యాంప్‌గ్రౌండ్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
వేదిక ..
- ప్రదేశం: Shenandoah Valley Campground
- చిరునామా: 296 Riner Ln, Verona, VA, 24482
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ క్యాంపింగ్ ఈవెంట్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
ఫ్యామిలీ (Family): $375
కపుల్ (Couple): $300
సోలో క్యాంపర్ (Solo Camper): $175
క్యాంపింగ్‌లో స్పాట్స్ చాలా పరిమితంగా ఉన్నాయి. ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సెర్వ్’ (ముందుగా వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత) ప్రాతిపదికన ఈ స్థానాలను భర్తీ చేస్తారు.
ఫీజు చెల్లింపు విధానం..
రిజిస్ట్రేషన్ ఫీజును కేవలం నగదు (Cash) లేదా చెక్ (Check) రూపంలో మాత్రమే స్వీకరిస్తారు. ఈ మొత్తాన్ని మే 31న జరగబోయే “శారద సాయంకాలం” (Sarada Sayankalam) ఈవెంట్లో నిర్వాహకులు సేకరిస్తారు. మరిన్ని వివరాలను జీఆర్టీఏ (GRTA) త్వరలోనే అధికారికంగా విడుదల చేయనుంది.
సంప్రదించాల్సిన నంబర్లు..
ఈ సమ్మర్ క్యాంపింగ్ ఈవెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్రింది ప్రతినిధులను సంప్రదించవచ్చు..
- జయపాల్: 603-767-8060
- ఈశ్వర్: 804-399-7579
- శ్రీపాల్: 831-578-0693
ప్రకృతి అందాల మధ్య సరికొత్త జ్ఞాపకాలను పంచుకుంటూ, అందరూ కలిసి కనెక్ట్ అవ్వడానికి ఈ క్యాంపింగ్ అద్భుతమైన అవకాశమని జీఆర్టీఏ ప్రతినిధులు తెలిపారు.
ఇవి కూడా చదవండి







