శృతితో పెద్ది స్పెషల్ మూవ్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది(Peddi)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ తెలుగు సినీ చరిత్రలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా రికార్డు సృష్టించగా, ఇప్పుడు హెల్లల్లాలో స్పెషల్ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నిర్మాత వెంకట సతీష్ కిలారు(Venkata Satish Kilaru) భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రోమోలో కనిపించిన విజువల్స్, గ్రాండ్ సెట్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి.
ఈ పాటలో రామ్ చరణ్‌తో పాటూ శృతి హాసన్(Shruti Haasan) కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎవడు(Yevadu) తర్వాత దాదాపు పదేళ్లకు ఈ జోడీ మరోసారి తెరపై కనిపించనుండటంతో ఫ్యాన్స్‌లో భారీ హైప్ నెలకొంది. అంతేకాకుండా జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా ఈ సాంగ్ లో చరణ్‌తో కలిసి స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(A. R. Rahman) అందించిన బీట్లు, క్యాచీ హుక్ స్టెప్ ఇప్పటికే రీల్స్ ప్రపంచంలో ట్రెండ్ అవుతాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మే 23న భోపాల్‌లో జరిగే అఫీషియల్ ఈవెంట్లో రెహమాన్ ఈ సాంగ్ ను లైవ్‌లో ప్రదర్శించనున్నారని తెలుస్తోంది.
ఇక కథ, పాత్రల విషయంలో డైరెక్టర్ బుచ్చిబాబు సాన తీసుకున్న శ్రద్ధ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రా ఎమోషన్స్‌ను మిళితం చేస్తూ ఆయన రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా హైలైట్ కానుంది. క్రికెటర్ పాత్ర కోసం లీన్ లుక్‌లో కనిపించిన చరణ్, రెజ్లర్ మరియు రన్నర్ పాత్రల కోసం భారీగా బాడీ బిల్డ్ చేసినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.







