కళ్లు చెదిరేలా రామాయణ రైట్స్
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా తెరకెక్కుతున్న రామాయణ(Ramayana) ఇప్పుడు మరోసారి ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్టర్ నితీష్ తివారీ(Nitesh Tiwari) రూపొందిస్తున్న ఈ మైథలాజికల్ విజువల్ ఎపిక్‌లో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీత పాత్రలో కనిపించనుండగా, యష్(Yash) రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచడంతో సినిమా బిజినెస్ చుట్టూ కూడా చర్చలు మొదలయ్యాయి.
ఇప్పుడు ముఖ్యంగా బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది ఈ సినిమా హిందీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ డీల్. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం నిర్మాత నమిత్ మల్హోత్రా(Namit Malhotra) హిందీ హక్కుల కోసం దాదాపు రూ.450 కోట్ల రేంజ్లో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తీవ్ర ఆసక్తి చూపించినప్పటికీ, ధర విషయంలో మాత్రం ఆలోచనలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తాన్ని రికవర్ చేయడం సులభం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇటీవల షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తున్న కింగ్(King) సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.250 కోట్ల రేంజ్లో ముగిసిన నేపథ్యంలో, రామాయణ ధర మరింత హై రిస్క్‌గా కనిపిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సినిమా మీద ఉన్న పాన్ ఇండియా హైప్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్, స్టార్ కాస్టింగ్‌ను దృష్టిలో పెట్టుకుంటే నిర్మాతలు భారీ బిజినెస్ టార్గెట్ పెట్టుకోవడం సహజమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ డీల్ ఎక్కడ ఫైనల్ అవుతుందనేదే బాలీవుడ్లో ఆసక్తికర చర్చగా మారింది.
ఇవి కూడా చదవండి







