22nd May 2026

____________

- Saidulu

మెల్లగా మన ఆరోగ్యాన్ని తగ్గిస్తున్న వంటింటి సామాన్లు

 మనం రోజూ వాడే కొన్ని రకాల పాత్రల వల్ల ఆహారం విషపూరితంగా మారుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం

నాన్‌స్టిక్ పాత్రలపై ఉండే టెఫ్లాన్ కోటింగ్ వేడెక్కినప్పుడు విడుదలయ్యే రసాయనాలు లివర్, కిడ్నీ సమస్యలకు కారణమవుతాయి.

నాన్‌స్టిక్ పాత్రలు

ఖాళీ నాన్‌స్టిక్ ప్యాన్ నిమిషాల్లోనే మితిమీరి వేడెక్కుతుంది. ఆ పొగ పీల్చడం వల్ల జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి ఫ్లూ వస్తుంది.

 టెఫ్లాన్ ఫ్లూ

అల్యూమినియం పాత్రల్లో పులుపు వండితే ఆ లోహం కరిగి అన్నంలో కలుస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని, నరాల బలాన్ని తగ్గిస్తుంది.

అల్యూమినియం పాత్రలు

వేడి కూరల్లో ప్లాస్టిక్ గరిటెలు వాడితే అవి కరిగి మైక్రోప్లాస్టిక్స్ రూపంలో కడుపులోకి చేరి తీవ్ర నష్టం కలిగిస్తాయి.

ప్లాస్టిక్ గరిటెలు

ప్లాస్టిక్ పాత్రల్లోని BPA అనే రసాయనం హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి థైరాయిడ్, పీసీఓడీ వంటి సమస్యలకు దారితీస్తుంది.

ప్లాస్టిక్ డబ్బాలు

చౌకరకపు సిరామిక్ పాత్రల కోటింగ్‌లో లీడ్ (సీసం) ఉంటుంది. ఇది ఆహారంలో కలిస్తే కిడ్నీలు, నరాల వ్యవస్థ పాడవుతాయి.

రంగుల సిరామిక్ పాత్రలు

నాన్‌స్టిక్‌కు బదులు ఇనుప పాత్రలు, అల్యూమినియం బదులు స్టీల్, ప్లాస్టిక్ గరిటెలకు బదులు చెక్క గరిటెలు వాడటం ఉత్తమం.

సురక్షితమైన ప్రత్యామ్నాయాలు