జూలై 17 నుండి TTA మెగా కన్వెన్షన్ బిజినెస్ ఫోరమ్
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ‘టిటిఎ మెగా కన్వెన్షన్ 2026’ లో భాగంగా ఏర్పాటు చేయనున్న ‘బిజినెస్ ఫోరమ్’ (Business Forum) వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. ఉత్తర కారోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 17 నుండి జూలై 19, 2026 వరకు ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ ఫోరమ్‌లో వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, లీడర్లు, ఇన్నోవేటర్లు ఒకే వేదికపైకి రానున్నారు.
ముఖ్య వక్త..
ఈ సంవత్సరం బిజినెస్ ఫోరమ్‌లో ఐమాక్ (IMAC – Denver, CO) ప్రెసిడెంట్, ప్రముఖ శాస్త్రవేత్త , నోబెల్ ప్రైజ్ నామినీ డా. ఎం.ఎస్. రెడ్డి (Dr. M.S. Reddy) ముఖ్య వక్తగా (Principal Speaker) హాజరుకానున్నారు. ఆయన “From Vision to Enterprise: The Journey of Business Growth” అనే అంశంపై ప్రత్యేక కీనోట్ ప్రసంగం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
- ప్రధాన ఆకర్షణలు..
డా. ఎం.ఎస్. రెడ్డి కీనోట్ సెషన్: వ్యాపార వృద్ధి, సరికొత్త విజన్లపై ప్రత్యేక ప్రసంగం. - టిటిఎ టెడ్ టాక్స్ (TTA TED Talks): ప్రముఖుల ఆలోచనలు పంచుకునే వేదిక.
- సక్సెస్ స్టోరీలు: విజయవంతమైన వ్యాపారవేత్తల స్ఫూర్తిదాయక ప్రయాణాలు.
- నెట్వర్కింగ్ అవకాశాలు: బిజినెస్ లీడర్లతో పరిచయాలు, భాగస్వామ్యాలకు అద్భుత అవకాశం.
కమిటీ సభ్యులు..
ఈ ప్రతిష్టాత్మక ఫోరమ్‌ను విజయవంతం చేయడం కోసం ప్రత్యేక కమిటీ బాధ్యతలు నిర్వహిస్తోంది.
- చైర్: శ్రవణ్ కుమార్ వంగూరు
- కో-చైర్స్: మహేష్ లక్కపల్లి, పృథ్వీ రాజ్ బల్లా, అజయ్ రెడ్డి
- సభ్యులు: డా. తరుణ్ మామిడి, మధుకర్ గున్రెడ్డి, వెనేష్ కుమార్ మొల్లేటి
నిర్వహకులు..
ఈ కార్యక్రమానికి టిటిఎ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి , కార్యవర్గ బృందం పర్యవేక్షణ అందిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
పరిమిత స్థానాలు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఆసక్తి గలవారు వెంటనే గూగుల్ ఫామ్ (https://forms.gle/XQjcshoqsxgT2eJb7) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, మరిన్ని వివరాలకు శ్రవణ్ కుమార్ (+1 678-641-6752) ను సంప్రదించాలని నిర్వాహక కమిటీ కోరింది.







