ఇలాంటి వారు పుడతారనే అపరిచితుడు సినిమా: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అనేది పూర్తిగా అబద్ధాల పునాదులపై పుట్టిన పార్టీ అని మండిపడ్డారు. జగన్ క్రూరత్వం, వైఎస్సార్ అరాచకాలు, రాజారెడ్డి దమనకాండ చరిత్ర నేటి తరం లోని చాలా మందికి తెలియదని, వారి కుటుంబ రాజకీయ చరిత్ర అంతా ఫ్యాక్షనిజంతో కూడుకున్నదని ఆరోపించారు.
తన సొంత తాత రాజారెడ్డి, తండ్రి వైఎస్సార్, మరియు బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి మరణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే(Chandrababu) కారణమంటూ జగన్ మాట్లాడటం అత్యంత హాస్యాస్పదమని అచ్చెన్నాయుడు విమర్శించారు. తాను చేసిన అక్రమ వ్యవహారాలు, ఫ్యాక్షన్ రాజకీయాలన్నింటినీ చంద్రబాబు తలకే చుట్టేందుకు జగన్ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో ఇలాంటి విచిత్రమైన, క్రూరమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు పుడతారని ముందే గ్రహించి.. దర్శకుడు శంకర్ ‘అపరిచితుడు’ సినిమా తీశారేమో అంటూ అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఊహించని రీతిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని మంత్రి గుర్తుచేశారు. ఈ ప్రగతిని చూసి ఓర్వలేకనే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం అనే పదాల గురించే మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. కేవలం అసత్యాలు, అపవాదులతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి







