పెద్దికి ఎలివేషన్లు ఇస్తున్న బోమన్ ఇరానీ
తెలుగు సినిమాల్లో బాలీవుడ్ నటులు కనిపించడం కొత్తేమీ కాదు. కానీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో వాళ్లు చూపించే ఆసక్తి మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో కూడా చాలామంది హిందీ నటులు షూటింగ్ పూర్తయ్యాక ప్రచార బాధ్యతలను హీరోలకే వదిలేస్తుంటారు. కానీ ఇప్పుడు పెద్ది(Peddi) విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. సినిమాలో కీలక పాత్ర పోషించిన బోమన్ ఇరానీ(Boman Irani) ముంబై మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నారు. ట్రైలర్లో కనిపించినది అసలు కథలో చిన్న భాగమేనని, థియేటర్లో చూసే ఎక్స్‌పీరియెన్స్ ఆడియన్స్ ను వెంటాడుతుందని ఆయన చెప్పడం బాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చకు దారి తీసింది.
బోమన్ ఇరానీతో పాటూ మరో నటుడు దివ్యేందు శర్మ(Divyendhu sharma) కూడా తన పాత్రపై ఆసక్తికర సంకేతాలు ఇస్తున్నారు. ప్రేక్షకులు తనను పూర్తిగా విలన్‌గా భావిస్తున్నారని, కానీ సినిమాలో పాత్రకు ఊహించని ఎమోషనల్ ఎడ్జ్ ఉంటుందని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ నార్త్ మార్కెట్లో కూడా సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సినిమా రిలీజ్ కు కేవలం పదమూడు రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ మరింత దూకుడు పెంచుతున్నాయి. ముఖ్యంగా భోపాల్‌లో జరగనున్న ఏఆర్ రెహమాన్(AR Rahman) ఈవెంట్ సినిమాకు నేషనల్ రేంజ్ హైప్ తీసుకొస్తుందని యూనిట్ నమ్ముతోంది. పెద్ది నార్త్ రైట్స్ దక్కించుకున్న జియో స్టూడియోస్(Jio Studios) కూడా భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్స్ రెడీ చేస్తుండటంతో పెద్ది ఓపెనింగ్స్‌పై ట్రేడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి







