మెగా సినిమాలకు చిక్కులు
మెగా హీరోల సినిమాలంటే సాధారణంగా రిలీజ్ డేట్లు ముందుగానే ఫిక్స్ అవుతూ భారీ హైప్ మధ్య ప్రమోషన్స్ మొదలవుతాయి. కానీ ప్రస్తుతం మెగా క్యాంప్‌కు చెందిన కొన్ని కీలక ప్రాజెక్టులు మాత్రం డిజిటల్ డీల్స్ కారణంగా అనిశ్చితిలో చిక్కుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర(Vishwambhara) పరిస్థితి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. షూటింగ్ దాదాపు పూర్తి దశకు చేరుకున్నప్పటికీ ఓటీటీ డీల్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో రిలీజ్ డేట్ ప్రకటించలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆగస్టులో రిలీజ్ చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, అఫీషియల్ క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు.
ఇక సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంబరాల ఏటి గట్టు(Sambarala Yeti Gattu) కూడా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, ఇప్పటికే ఖర్చు అంచనాలను దాటిపోయినట్లు సమాచారం. దీంతో మిగిలిన షూట్‌ను పూర్తి చేయడానికి ముందుగా డిజిటల్ డీల్ క్లోజ్ చేయాలన్న దిశగా నిర్మాతలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ సంస్థలతో ధర విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతుండటంతో డీల్ ఆలస్యం అవుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు వరుణ్ తేజ్(Varun Tej) నటిస్తున్న కొరియన్ కనకరాజు(korean kanakaraju) షూటింగ్ ఇప్పటికే పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ డీల్ ఇంకా కుదరలేదు. దీంతో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా వాయిదా పడుతోంది. ఒకప్పుడు థియేట్రికల్ బిజినెస్‌పైనే ఆధారపడిన టాలీవుడ్ ఇప్పుడు ఓటీటీ డీల్స్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో డిజిటల్ హక్కులే రిలీజ్ ప్లాన్స్‌ను నిర్ణయించే స్థాయికి చేరుకోవడం ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీస్తోంది.
ఇవి కూడా చదవండి







