అఖిల్ మునుపెన్నడూ లేనంత కాన్ఫిడెంట్‌గా!
అక్కినేని అఖిల్(Akkineni Akhil) హీరోగా తెరకెక్కుతున్న లెనిన్(Lenin) సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్ ప్రేక్షకుల్లో మంచి హైప్ తీసుకురాగా, ఇప్పుడు మనోడు వస్తున్నాడు పేరుతో వచ్చిన స్పెషల్ టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా నాగార్జున(Nagarjuna) సినీ ప్రయాణం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ టీజర్‌ను రిలీజ్ చేయడం అభిమానుల్లో ప్రత్యేక ఎమోషన్ ను కలిగించింది. టీజర్ ప్రారంభంలో భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri Borse) స్టేజ్ ప్లేలో సీనియర్ ఎన్టీఆర్(Sr. Ntr) డైలాగ్‌ను చెప్పే సన్నివేశం ఆకట్టుకోగా, ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంలోకి కథ మలుపు తిరిగిన తీరు సినిమాకి ఓ మాస్ టచ్ ఇచ్చింది.
ఈ టీజర్లో అఖిల్ అక్కినేని పూర్తిగా కొత్త అవతారంలో కనిపించాడు. ఇప్పటివరకు తన కెరీర్లో చేయని రగ్గడ్ మాస్ పాత్రలో అఖిల్ కనిపించడం ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్‌లా మారింది. ముఖ్యంగా చిత్తూరు యాసలో చెప్పిన డైలాగులు, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ షాట్స్‌లో అతడు చూపించిన ఇంటెన్సిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భాగ్యశ్రీ బోర్సేతో కలిసి బైక్ రైడ్ సన్నివేశాల్లో ఇద్దరి కెమిస్ట్రీ కూడా సహజంగా కనిపించింది. టీజర్ మొత్తం మీద అఖిల్‌లో కనిపించిన మెచ్యూరిటీ, యాక్టింగ్ లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూరు(Murali Kishore Abburu) ఈ సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటూ బలమైన ఎమోషన్స్ తో రూపొందిస్తున్నట్లు టీజర్ స్పష్టంచేసింది. తమన్(Thaman) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత ఎనర్జీ తీసుకొచ్చింది. చివర్లో వచ్చే ఎలివేషన్ షాట్, అఖిల్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. శివాజీ(Shivaji), బ్రహ్మాజీ(Brahmaji) వంటి నటుల పాత్రలకూ టీజర్లో చిన్న గ్లింప్స్ ఇవ్వడం ఆసక్తిని పెంచింది. నాగార్జున, నాగ వంశీ(Naga Vamsi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 26, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.







