ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి చోటులేదు : సీఎం చంద్రబాబు
సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. చిత్తూరు జిల్లా (Chittoor District) యాదమర్రిలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో చంద్రబాబు మాట్లాడారు. రప్పారప్పా రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలా? సీబీఎన్ (CBN) దగ్గర తోక జాడిస్తే, ప్రజాహితం కోసం తోక కట్ చేస్తానని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి చోటులేదని అన్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ ఇవ్వాలి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రోజుకొక నాటకమాడుతున్నారు. అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కోడి కత్తి, గులకరాయి నాటకాలు గుర్తున్నాయి కదా? దళిత యుకుడు సుబ్రమణ్యాన్ని (Subramanyam) హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వారికి సన్మానాలా? కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు, తల్లి, చెల్లికి ఆస్తులివ్వకుండా వేధించారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వారు, ప్రజలను ఏం చూస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. నేను ప్రజల సేవకుణ్ణి, పెత్తందారు కాదు. నిరంతరం పనిచేసి పేదల రుణం తీర్చుకుంటా. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించింది ఎన్డీయే కూటమి అని అన్నారు.







