జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బలూచ్ ఆర్మీ పంజా.. 23 మంది పాకిస్తానీల మృతి…!
స్వతంత్ర దేశాన్ని కాంక్షిస్తున్న బలూచిస్తాన్ ఆర్మీ.. మరోసారి పాకిస్తాన్ సైన్యంపై పంజా విసిరింది. జాఫర్ ఎక్స్ ప్రెస్ కు అనుబంధంగా ఉన్న షటిల్ ప్యాసింజర్ పై ఆత్మాహుతి (Explosion in Pakistan )దాడికి దిగింది.క్వెట్టా ప్రాంతంలోని చమన్ ఫాటక్ రైల్వేస్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 80మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న రైలు స్టేషన్ సమీపంలోని సిగ్నల్ దాటుతుండగా.. పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం రైలు బోగీని ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పేలుడు సంభవించిందన్నారు. మృతుల్లో ఎక్కువమంది సైనికులే ఉన్నారన్నారు.
పేలుడు దాటికి రైలు పాక్షకంగా దెబ్బతిందని.. 10కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు చోటుచేసుకోవడంతో రైళ్ల రాకపోకల్లో అంతరాయం కలిగినట్లు అధికారులు వెల్లడించారు. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్లో నిలిపివేసినట్లు తెలిపారు. పేలుడు తీవ్రతకు జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక బోగీకి మంటలు అంటుకొన్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.
మేమే దాడి చేశాం: బలోచ్ లిబరేషన్ ఆర్మీ
రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు ఘటన తమ పనేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాక్ దళాల సిబ్బందిని తీసుకువెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకున్నామని బలోచ్ ఆర్మీ ప్రతినిధి జీయాండ్ బలోచ్ వెల్లడించారు. పాక్ నేతలు తమ ప్రజలను అణచివేస్తున్నారని బలూచ్ ప్రతినిధులు ఆరోపించారు. తమ సంస్కృతి, గుర్తింపు, హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. అణచివేతకు గురైన ప్రతి బలోచ్ బిడ్డ తన మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నారు.
జాఫర్ ఎక్స్‌ప్రెస్‌కు కొన్నేళ్లుగా ముప్పు పొంచిఉంది. బలోచ్ రెబల్స్, తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) గ్రూప్ ఈ రైలును పలుమార్లు లక్ష్యంగా చేసుకొన్నాయి. దీనికి చాలా వ్యూహాత్మక కారణాలున్నాయి. ఈ రైల్లో తరచూ సైనిక దళాలను క్వెట్టా నుంచి పంజాబ్‌కు తరలిస్తుంటారు. దీంతో మిలిటెంట్ గ్రూప్‌లకు ఇది హాట్ టార్గెట్‌గా మారింది. 2018, 2023లో పలుమార్లు దీనిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. తాజాగా కూడా సైనిక కుటుంబాలు ప్రయాణిస్తుండగానే దాడి చోటు చేసుకొంది.
ఇవి కూడా చదవండి







