కుటుంబ సభ్యులతో మోదీని కలిసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కుటుంబసభ్యులతో ప్రధాని మోదీ (Modi)ని కలుసుకున్నారు. తల్లి విజయకుమారి (Vijayakumari), సతీమణి శ్రావ్య, కుమార్తె మిహిర, కుమారుడు శివాంగ్ ఎర్రన్నాయుడు (Shivang Yerran Naidu)లను వెంటబెట్టుకొని సేవాతీర్థ్ లో ప్రధానిని కలిశారు. 20 నిమిషాల పాటు సాగిన భేటీలో రామ్మోహన్ నాయుడు ప్రధానికి పొందూరు ఖాదీ, అరసవల్లి సూర్యనారాయణ స్వామి విగ్రహం అందజేశారు. వీలైతే ఎప్పుడైనా పొందూరు ఖద్దరును ధరించాలని ప్రధానిని కోరగా మోదీ సుముఖత వ్యక్తం చేశారు.
అనంతరం మీరు పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మా కే నామ్ ( తల్లి పేరున ఒక చెట్టు) నినాదం స్ఫూర్తితో మా అమ్మను తీసుకొచ్చాను, ఒక మొక్కనూ తెచ్చాను అని రామ్మోహన్ నాయుడు తన తల్లి విజయకుమారిని ప్రధానికి పరిచయం చేశారు. ఆమె చేతులమీదుగా మొక్కను అందించారు. సంతోషం వ్యక్తం చేసిన మోదీ విజయకుమారితో మాట్లాడుతూ చాలా మంది నాయకుల పిల్లలు సరిగా పనిచేయలేకపోతున్నారు. మీరు మాత్రం మీ కుమారుణ్ని చూసి గర్వపడాలి. చిన్న వయసులో మంత్రిపదవి వచ్చినా కష్టపడి పనిచేస్తూ అందరి మెప్పు పొందుతున్నారు అని అన్నారు.
ఇవి కూడా చదవండి







