వైసీపీ తప్పుడు ప్రచారం.. పాఠశాలలు తెరిచే నాటికి అందిస్తాం: మంత్రి లోకేశ్
విద్యార్థి మిత్ర కిట్లు నిలిపివేశామని వైసీపీ (YCP) తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. యూనిఫామ్, షూ, బ్యాగ్లు, పుస్తకాలు ఇవ్వడం లేదనేది తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. పాఠశాలలు(Schools) తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు (Books), నోట్ బుక్స్ అందిస్తామన్నారు. యÖనిఫామ్, బ్యాగులు, బూట్ల పంపిణీ నెలరోజులు ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా కిట్ల పంపిణీలో కాస్త ఆలస్యం జరుగుతోందన్నారు. అధికారుల ప్రకటనను వక్రీకరించడం జగన్ వంకరబుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి







