జూన్ 6 నుండి ఆటా ‘శాట్’ ఆన్లైన్ కోచింగ్ క్లాసులు
అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజ ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తున్న ‘అమెరికా తెలుగు సంఘం’ (ATA) హైస్కూల్ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక విద్యా ప్రణాళికను సిద్ధం చేసింది. ఉన్నత విద్యా అవకాశాల కోసం విద్యార్థులు రాసే ప్రతిష్టాత్మక పరీక్ష ‘శాట్’ (SAT Prep Coaching Program) కోసం సరికొత్త కోచింగ్ బ్యాచ్‌ను ప్రారంభించనున్నట్లు ఆటా ప్రకటించింది. శాట్ కోచింగ్ రంగంలో 10 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రొఫెషనల్ ట్యూటర్లచే ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఈ ఆన్లైన్ కోర్సు 2026 జూన్ 6వ తేదీ నుండి ప్రారంభమై 2026 ఆగస్టు 30వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఈ కోచింగ్ ప్రోగ్రామ్‌ను విద్యార్థుల స్థాయిని బట్టి రెండు వేర్వేరు విభాగాలుగా, కేవలం వారాంతాల్లో (శని, ఆదివారాలు) నిర్వహించనున్నారు.
బిగినర్ క్లాస్ (Beginner Class): మధ్యాహ్నం 3:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు (EST)
అడ్వాన్స్డ్ క్లాస్ (Advanced Class): సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 6:30 గంటల వరకు (EST)
ఫీజు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ (How to Register):
ఆటా సభ్యులు కాని వారు ముందుగా tinyurl.com/ATA-Membership లింక్ ద్వారా సభ్యత్వం పొందాలి.
సభ్యత్వం ఉన్నవారు tinyurl.com/ATA-ATA-SATPayment లింక్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. పేమెంట్ కేటగిరీలో ‘Educational Services-SAT Advanced / Beginners’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఫీజు చెల్లించే సమయంలో కామెంట్స్ సెక్షన్లో విద్యార్థి పేరు (Student Name), ఈమెయిల్ ఐడీ, గ్రేడ్ కోరుకుంటున్న ట్రాక్ లెవెల్ (Advanced లేదా Beginner) వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఫీజు చెల్లించిన విద్యార్థులందరికీ తరగతులు ప్రారంభమయ్యే ఒక రోజు ముందే ఆన్లైన్ క్లాస్ లింకులు ఈమెయిల్ ద్వారా పంపుతారు. మునుపటి బ్యాచ్‌లలో విద్యార్థులు శాట్ యాక్ట్ (ACT) పరీక్షల్లో అత్యుత్తమ స్కోర్లు సాధించారని ఆటా ప్రతినిధులు తెలిపారు. ఈ కోర్సులో సీట్లు పరిమితంగా ఉన్నందున విద్యార్థులు త్వరగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని స్టూడెంట్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ నరసింహ చిట్టాలూరి, సభ్యులు శిరీష బుర్ర, రవీందర్ దాసరపు, వరుణ్ కంచర్ల, సలహాదారు బాలకిషన్ కొంపెల్లి ఒక ప్రకటనలో కోరారు.







