డ్రీమ హౌస్ ను నిర్మించుకుంటున్న ప్రభాస్
పాన్ ఇండియా స్టార్‌గా దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్(Prabhas) ఇప్పుడు సినిమాలతో పాటు భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఒక్కో సినిమాకు దాదాపు రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్న ప్రభాస్, వరుస ఫ్లాప్స్ వచ్చినా తన మార్కెట్‌ను మాత్రం ఏమాత్రం కోల్పోలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో భారీ బడ్జెట్ సినిమాలుండగా, పలువురు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఆయన ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో విలాసవంతమైన ఆస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటికే రాయదుర్గంలోని ఆయన గెస్ట్ హౌస్ టాలీవుడ్ సెలబ్రిటీలకు పార్టీ స్పాట్‌గా మారిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
అయితే అక్కడి ప్రదేశం బిజీగా మారడంతో మరింత ప్రైవసీ, విలాసవంతమైన వాతావరణం కోసం ప్రభాస్ కొత్త డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రెండు ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. కోకాపేట్ ORR ఎగ్జిట్‌కు సమీపంలో ఉన్న ఈ భూమి విలువ ఎకరాకు రూ.80 కోట్లకు పైగానే ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
దాదాపు రెండేళ్ల క్రితమే ఈ భూమిని ప్రభాస్ కొనుగోలు చేసినట్లు సమాచారం. తాజాగా అక్కడ తన డ్రీమ్ మ్యాన్షన్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా ఈ ప్రాపర్టీ ఉండటం ప్రత్యేకతగా మారింది. ఈ నిర్మాణం పూర్తవ్వడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశముందని తెలుస్తోంది. ఇదే కాకుండా గత ఐదేళ్లుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ ల్యాండ్స్‌లో కూడా ప్రభాస్ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరగడంతో ప్రభాస్ పెట్టుబడుల విలువ కూడా భారీగా పెరిగిందని సినీ, రియల్ ఎస్టేట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.







