మహి – రాజ్ ద్వీయ దర్శకత్వంలో ‘బెంగళూరు మహానగరంలో బాలక’ చిత్రం
మంత్ర మూవీ మేకర్స్, ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా, మహి – రాజ్ ద్వీయ దర్శకత్వంలో బెంగళూరు మహానగరంలో బాలక చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇటీవలే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొదటి లుక్, కధానాయకుడు ప్రియదర్షి విడుదల చేశారు..

ఆంధ్ర కుర్రాడు బెంగళూరులో ఎదుర్కొనే కష్టాల నేపథ్యంతో వినోదభరితమైన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.
నివేదా థామస్ వారి తమ్ముడు నిఖిల్ థామస్ నటిస్తున్న ఈ చిత్రానికి మల్లూ నాయక్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. విశ్వదీప్ సంగీతాన్ని అందిస్తున్నారు, హర్షిత్ కొటా ఏడిటర్ గా చేస్తున్నరు.







