టామా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4 నుండి 3-నైట్స్ విలాసవంతమైన క్రూయిజ్ టూర్
TAMA: అమెరికాలోని’అట్లాంటా తెలుగు సంఘం‘ (TAMA) తన 45వ వసంతోత్సవ వేడుకలను పురస్కరించుకుని సరికొత్త, వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2026 లేబర్ డే వీకెండ్ సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన “టామా 3-నైట్స్ క్రూయిజ్” (TAMA 3-Nights Cruise) ప్రయాణాన్ని ప్రకటించింది. ప్రసిద్ధ ‘నార్వేజియన్ గెటవే’ (Norwegian Getaway) విలాసవంతమైన ఓడలో ఈ ప్రయాణం సాగనుంది.
వివరాలు..
సెప్టెంబర్ 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు (సెప్టెంబర్ 4–7, 2026) 3 రాత్రుల పాటు సాగే ఈ క్రూయిజ్ ప్రయాణం ఫ్లోరిడాలోని మయామి నుండి ప్రారంభమై.. బహామాస్లోని గ్రేట్ స్టిరప్ కే (Great Stirrup Cay) , నాసావు (Nassau) మీదుగా తిరిగి మయామికి చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో టామా అసోసియేషన్ సభ్యుల కోసం ప్రత్యేకంగా కస్టమైజ్డ్ ఫుడ్, కాక్టెయిల్ పార్టీలతో పాటు పలు వినోదాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ క్రూయిజ్ ప్యాకేజీలలో బాల్కనీ (Balcony), ఇంటీరియర్ (Interior) క్యాబిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ ప్రయాణికులకు (గెస్ట్ 1 నుండి గెస్ట్ 4 వరకు) ప్రత్యేక ధరలు , ఆకర్షణీయమైన ప్యాకేజీ అమెనిటీస్ (అన్లిమిటెడ్ ఓపెన్ బార్, స్పెషాలిటీ డైనింగ్, ఎక్స్కర్షన్ క్రెడిట్స్, వైఫై, ఫొటోస్ ప్యాకేజీ) కల్పిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
పరిమిత స్థానాలు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఆసక్తి గల తెలుగు వారు, అసోసియేషన్ సభ్యులు వెంటనే గూగుల్ ఫామ్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది ప్రతినిధులను సంప్రదించవచ్చు:
ప్రెసిడెంట్: సునీత పొట్నూరు (404-988-9429)
చైర్మన్: మధుకర్ యార్లగడ్డ (913-609-3563)
ఇతర ప్రతినిధులు: సురేష్ బండారు (313-919-3381), సునీల్ దేవరపల్లి (404-536-1183), చలమయ్య బాట్చు (404-617-2357), సురేష్ యాదగిరి (404-680-6968).
ఆసక్తి గలవారు info@tama.org లేదా www.tama.org వెబ్సైట్ ద్వారా కూడా సంప్రదించవచ్చని టామా కార్యవర్గం తెలిపింది.
ఇవి కూడా చదవండి







