ఒకే సినిమాకు వర్క్ చేయనున్న తమన్, అనిరుధ్
బాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొల్పుతున్న సల్మాన్ ఖాన్(Salman khan) కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి(vamshi paidipally) తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు తమన్(thaman), అనిరుధ్ (Anirudh) కలిసి పని చేయబోతున్నారనే వార్త వైరల్‌గా మారింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా, ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఈ ఇద్దరినీ భారీ రెమ్యూనరేషన్లతో ఒప్పించారనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు తమన్ పాటలకు సంగీతం అందించనుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ముంబై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఈ ప్రాజెక్ట్‌పై బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. సల్మాన్ ఖాన్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) నటిస్తుండటం సినిమాపై మరింత క్రేజ్ తీసుకొచ్చింది.
దిల్ రాజు(Dil Raju), శిరీష్(Sireesh) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోందని సమాచారం. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. నెక్ట్స్ ఇయర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు త్వరలో ప్రకటించే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మాత్రం తమన్- అనిరుధ్ కాంబినేషన్ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.







