షార్లెట్ లో కర్నూలు డిఐజిని సత్కరించిన ఎన్నారైలు
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు రేంజ్ డిఐజి డా. ప్రవీణ్ కోయ గారిని నార్త్ కరోలినాలోని షార్లెట్ లో పలువురు ఎన్నారైలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం తెలుగు సమాజానికి ఒక చారిత్రాత్మకమైన మరియు భావోద్వేగభరితమైన సందర్భంగా నిలిచిపోయింది. 2026 మే 17వ తేదీ, ఆదివారం నాడు, షార్లెట్ లోని తెలుగు కుటుంబాలు తొలిసారిగా ఒక డిఐజి అధికారిని సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఎజిసిఎ, టిటిఎ, తానా, ఎన్నారై టీడిపి నాయకులు, ఇతర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. దాదాపు 109 మందికి పైగా హాజరై, చూపించిన అభిమానము, గౌరవం మరియు అపూర్వ స్పందనపై డిఐజి ప్రవీణ్ కోయ గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నారైలు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ మరపురాని సాయంత్రాన్ని ఘనవిజయంగా మార్చడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.









