ఆదర్శకుటుంబంలో సీనియర్ హీరోయిన్ గెస్ట్ రోల్?
దగ్గుబాటి వెంకటేష్(Venkatesh Daggubati) హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శకుటుంబం(aadarsha Kutumbam)పై టాలీవుడ్లో రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు కొత్త అర్థం చెప్పిన ఈ ఇద్దరి కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. మూవీలో కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఓ సీనియర్ హీరోయిన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్యారెక్టర్ కథను ఎమోషనల్ గా మలుపు తిప్పేలా ఉంటుందని, వెంకటేశ్ పాత్రకు బలమైన ఎమోషనల్ కనెక్షన్‌ను తీసుకురాబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. తన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఈసారి మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను కూడా బలంగా మిక్స్ చేస్తున్నారట. ముఖ్యంగా వెంకటేశ్ కామెడీ టైమింగ్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా కొన్ని ఎపిసోడ్స్‌ను డిజైన్ చేశారని తెలుస్తోంది. గతంలో నువ్వు నాకు నచ్చావ్(Nuvvu Naku Nachav), మల్లీశ్వరి(Malleswari) వంటి క్లాసిక్ సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన త్రివిక్రమ్, వెంకటేశ్ కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడదే కాంబో పూర్తి స్థాయి సినిమాగా రావడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
మరోవైపు హారికా హాసినీ క్రియేషన్స్(Haarika hassine creations) ఈ సినిమాను అత్యంత భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతోంది. షూటింగ్ ప్లానింగ్ నుంచి టెక్నికల్ స్టాండర్డ్స్ వరకు ప్రతీ విషయంలో హై క్వాలిటీ మెయింటైన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేసి భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో టీమ్ పనిచేస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్, మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఈ కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం. సరైన కంటెంట్‌తో వస్తే ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి







