తెలివిగా తప్పించుకున్న వెంకీ
మలయాళంలో సస్పెన్స్ థ్రిల్లర్లకు కొత్త ప్రమాణాలు తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజీకి ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు విడుదలైన దృశ్యం3(Drishyam3) రివ్యూలు మాత్రం అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో భారీ స్థాయిలో ల్యాగ్ ఉందని, గత భాగాల మాదిరిగా ఉత్కంఠభరితమైన ట్విస్టులు లేకపోవడం ప్రధాన మైనస్‌గా మారిందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓవర్సీస్తో పాటు మలయాళంలో మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, టాక్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు రీమేక్ కోసం దృశ్యం3 పై వెంకటేష్ ఆసక్తి చూపించినట్లు, చర్చలు కూడా చివరి దశకు చేరుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ తన కమిట్మెంట్స్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గారు. బదులుగా చిరంజీవి(Chiranjeevi) నటించిన మన శంకరవరప్రసాద్ గారు(MSG) సినిమాకు డేట్స్ కేటాయించారు వెంకీ. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో, ఇప్పుడు వెంకటేష్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ప్రస్తుతం వెంకటేష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbam) షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన, ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్(Nandamuri Kalyan Ram) తో కలిసి ఓ ఎంటర్టైనర్లో నటించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి 2027 టార్గెట్‌తో సిద్ధమవుతోంది. దీంతో వెంకటేష్ కెరీర్ ప్లానింగ్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
ఇవి కూడా చదవండి







