Venky-Trivikram: ఆదర్శ కుటుంబం కోసం స్పెషల్ సెట్
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(venkatesh) మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(trivikram srinivas) కాంబినేషన్లో ఆదర్శ కుటుంబం(aadarsha kutumbam) సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో ప్రత్యేక చర్చకు దారి తీస్తోంది. కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్(annapurna studios) లో ఓ భారీ ఇంటి సెట్ నిర్మాణం జరుగుతోందని తెలుస్తోంది.
కథలో కీలక మలుపులు చోటుచేసుకునే సన్నివేశాలను ఈ సెట్ వేసిన ఇంట్లో చిత్రీకరించనున్నారట. ఈ నెల నాలుగో వారంలో షూటింగ్ ప్రారంభం కానుండగా, ఈ షెడ్యూల్ సినిమాకు ప్రధాన బలం కానుందని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విదేశీ షెడ్యూల్ పూర్తిగా పాటలకే పరిమితం చేయడం. కథ మొత్తాన్ని భారతీయ కుటుంబ వాతావరణంలోనే మలిచే ప్రయత్నం చేస్తూనే, పాటలకు మాత్రం విజువల్ గ్రాండియర్ జోడించాలన్న ఆలోచనతో చిత్రబృందం విదేశాలకు వెళ్లనుంది.
ఇవి కూడా చదవండి
క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడని త్రివిక్రమ్, ప్రతి సన్నివేశాన్ని కచ్చితత్వంతో తెరకెక్కించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఆల్రెడీ వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో గతంలో నువ్వు నాకు నచ్చావ్(nuvvu naku nachav), మల్లీశ్వరి(malliswari) లాంటి సినిమాలు రాగా, ఆ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయి దర్శకత్వంలో ఆయన తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
ఇవి కూడా చదవండి













