న్యూజెర్సీ తెలుగు కళా సమితి సరికొత్త రికార్డు.. రెండేళ్లలో 33 వైవిధ్యభరిత కార్యక్రమాలు విజయవంతం
TFAS : అమెరికాలోని ‘తెలుగు కళా సమితి’ (TFAS – Telugu Fine Arts Society, New Jersey) ప్రస్తుత బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (BOT) హయాంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. 2024-2026 మేనేజింగ్ కమిటీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు అత్యంత విజయవంతంగా 33 విభిన్న కార్యక్రమాలను (33 Events) నిర్వహించి, స్థానిక తెలుగు కమ్యూనిటీలో సరికొత్త ఉత్తేజాన్ని నింపింది.
లాభాపేక్ష లేని సాంస్కృతిక సంస్థగా (501 c Non Profit Org) కొనసాగుతున్న టీఎఫ్ఏఎస్.. కేవలం సాంస్కృతిక వేడుకలకే పరిమితం కాకుండా సామాజిక, వైద్య, క్రీడా, విద్యా రంగాలకు సంబంధించిన ఎన్నో వైవిధ్యభరితమైన ఈవెంట్లను నిర్వహించింది.
విజయవంతంగా సాగిన కార్యక్రమాలు..
వైద్యం & అవగాహన సదస్సులు: ఎడిసన్ నగరంలో ఉచిత మెడికల్ క్యాంప్, డాక్టర్ ఉన్నతి ఆధ్వర్యంలో పెయిన్ ఫ్రీ లైఫ్ సెమినార్, డాక్టర్ బైరి శ్రీనివాసరావు నేతృత్వంలో నేచురోపతి ద్వారా నివారణ ఆరోగ్య సంరక్షణపై వెబినార్లు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
కొండవీటి జ్యోతిర్మయి సంగీత విభావరి, సంక్రాంతి సంబరాలు (పెళ్లి సందడి, పొట్టిల్లు, కవితల పోటీలు), ఉగాది వేడుకలు, త్రిమూర్తి ఆరాధనోత్సవాలు, , మే 30న జరగనున్న ‘అన్నమయ్యకు ఆరాధన’ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. క్రీడా స్ఫూర్తిని నింపేలా వాలీబాల్, టెన్నిస్, క్రికెట్, బాడ్మింటన్, బౌలింగ్ , పికిల్ బాల్ టోర్నమెంట్లను సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. ఎన్నారైల కోసం లీగల్ సెమినార్, ఇమ్మిగ్రేషన్ వెబినార్, యూఎక్స్-యూఐ (UX-UI) ఆన్లైన్ వెబినార్ , స్వచ్ఛంద సేవకులను గౌరవిస్తూ ‘వాలంటీర్ అప్రిషియేషన్ డిన్నర్’ వంటి కార్యక్రమాలను కూడా సమితి నిర్వహించింది.
తెలుగు కళా సమితి – టీఫాస్ 2024-26 మధ్యకాలంలో నిర్వహించిన 33 ఈవెంట్ల వివరాలు..
33 ఈవెంట్ల జాబితా:
జూన్ 9, 2024: టీఫాస్ మెడికల్ క్యాంప్ (సాయి దత్తా పీఠం, ఎడిషన్ NJ)
జూన్ 16, 2024: టీఫాస్ 2024-26 BOT మీట్ అండ్ గ్రీట్ (గోదావరి, ఎడిషన్ NJ)
జులై 6, 2024: ప్రముఖ గాయని కొండవీటి జ్యోతిర్మయితో టీఫాస్ సంగీత విభావరి (Somerset NJ)
జులై 21, 2024: తెలుగు ఎన్నారై రేడియోలో టీఫాస్ స్పెషల్ చిట్ చాట్
ఆగస్టు 10, 2024: అటార్నీల ప్యానెల్‌తో టీఫాస్ లీగల్ సెమినార్ (ఫోర్డ్స్ పబ్లి5క్ లైబ్రరీ, Fords NJ)
జులై 28, 2024: టీఫాస్ వార్షిక పిక్నిక్ (Burke’s Park, Sayreville NJ)
సెప్టెంబర్ 14, 2024: టీఫాస్ 2024 వాలీబాల్ టోర్నమెంట్
సెప్టెంబర్ 14-15, 2024: టీఫాస్ 2024 టెన్నిస్ టోర్నమెంట్
సెప్టెంబర్ 29, 2024: మంగళంపల్లి బాలమురళీకృష్ణకు నివాళి (Ananda Mandir, Somerset NJ)
Sep 21 – Oct 13, 2024: టీఫాస్ 2024 క్రికెట్ టోర్నమెంట్
October 6, 2024: టీఫాస్ 2024 బ్యాడ్మింటన్ టోర్నమెంట్
October 6, 2024: దీపావళి సంబరాల కోసం టీఫాస్ గాట్ టాలెంట్ మ్యూజిక్, డాన్స్ పోటీలు
December 14, 2024: కైరోప్రాక్టర్ డాక్టర్ ఉన్నతితో ‘నొప్పులు లేకుండా జీవించడం ఎలా’ అనే సదస్సు (Edison)
మార్చి 9, 2025: టీఫాస్-త్రిమూర్తి ఆరాధనా దినోత్సవం (Ananda Mandir)
April 12, 2025: టీఫాస్-ఉగాది వేడుకలు (శ్రీ వేంకటేశ్వర టెంపుల్, బ్రిడ్జి వాటర్)
జూన్ 14, 2025: సామవేదం షణ్ముఖ శర్మ గారి కోసం ‘శివపాద నాట్య కుసుమాంజలి’ (Shree Swamy Narayana Mandir)
జూన్ 22, 2025: టీఫాస్ బౌలింగ్ టోర్నమెంట్ (Wyckoff, NJ)
జులై 20, 2025: టీఫాస్ వార్షిక పిక్నిక్ (Burke’s Park, Sayreville NJ)
ఆగస్టు 23, 2025: టీఫాస్ పికల్బాల్ టోర్నమెంట్ 2025 (Inman Ave)
సెప్టెంబర్ 6, 2025: టీఫాస్ STARS కాంపిటీషన్స్ 2025 (Edison NJ)
సెప్టెంబర్ 20, 2025: టీఫాస్ దీపావళి జాతర (Oak Tree Road, Edison NJ)
సెప్టెంబర్ 2025: టీఫాస్ క్రికెట్ టోర్నమెంట్, NJ
నవంబర్ 22, 2025: ఇమ్మిగ్రేషన్ మరియు న్యాయపరమైన అంశాలపై టీఫాస్ ఆన్లైన్ వెబినార్
జనవరి 11, 2025: యూఎక్స్-యూఐపై టీఫాస్ ఆన్లైన్ వెబినార్
జనవరి 10, 2026: కృష్ణ లీలా తరంగిణి (Guntur, India)
జనవరి 24, 2026: సంక్రాంతి 2026, పెళ్లి సందడి (Swamy Narayana Temple, Somerset, NJ)
జనవరి 24, 2026: సంక్రాంతి 2026, కవితల పోటీలు (Swamy Narayana Temple, Somerset, NJ)
జనవరి 24, 2026: సంక్రాంతి సంబరాలు 2026 (Swamy Narayana Temple, Somerset, NJ)
మార్చి 1, 2026: టీఫాస్ త్రిమూర్తి డే 2026 (Swamy Narayana Temple, Somerset, NJ)
మార్చి 3, 2026: డాక్టర్ బైరి శ్రీనివాసరావుతో నేచురోపతీ ద్వారా ప్రివెంటివ్ హెల్త్ పై వెబినార్
మే 3, 2026: టీఫాస్ ఉగాది వేడుకలు (Royal Albert Palace, Fords, NJ)
మే 15, 2026: వాలంటీర్ అప్రిసియేషన్ డిన్నర్ (Bhog Restaurant, Somerset, NJ)
మే 30, 2026: అన్నమయ్యకు ఆరాధన (SDP Siva Vishnu Temple, Edison, NJ)
టీఎఫ్ఏఎస్ 2024 – 2026 కార్యవర్గం..
ఈ 33 కార్యక్రమాల విజయవంతమైన ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (BOT) సభ్యుల వివరాలు:
- ప్రెసిడెంట్: మధు అన్న (Madhu Anna) – (201) 674-5447
- వైస్ ప్రెసిడెంట్: ప్రసాద్ వూటుకూరు (Prasad Vootukuru) – (732) 789-0272
- సెక్రటరీ: వెంకట సత్య టాటా (Venkata Satya Tata) – (973) 985-3409
- ట్రెజరర్: శ్రీమతి సత్యవాణి కునిశెట్టి (Smt. Satyavani Kunisetty) – (732) 666-2115
- యాన్యువల్ (కల్చరల్) ఈవెంట్స్: శేషగిరి రావు కంభంమెట్టు – (732) 910-3966
- కమ్యూనిటీ సర్వీసెస్: శ్రీమతి వరలక్ష్మి రాధాకృష్ణ – (774) 288-9365
- మెంబర్షిప్ సర్వీసెస్: శ్రీమతి అరుంధతి శాకెల్లి – (732) 735-3786
- ఐటీ సర్వీసెస్/వెబ్: లోకేందర్ గిరకాల – (718) 709-6639
- యూత్ కమిటీ: శ్రీమతి లతా మాదిశెట్టి – (973) 964-4249
న్యూజెర్సీలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ.. ప్రవాస తెలుగు వారిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ కమిటీ నిరంతరం కృషి చేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతామని టీఎఫ్ఏఎస్ ప్రతినిధులు వెల్లడించారు. సంస్థకు సంబంధించిన పూర్తి వివరాల కోసం www.tfasnj.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కోరారు.








