ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడలోని ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 లో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
• డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ పేరిట ఓ కళావేదికను ఇవాళ ప్రారంభించుకుని ఎంఎస్ఎంఈ సమ్మిట్ 2026 నిర్వహిస్తున్నాం
• 4.4 ఎకరాల్లో 1.45 చదరపు అడుగుల స్థలం లో ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాం
• ఓ చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమ గా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉంది
• దేశంలో వ్యవసాయం తరవాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం ఇదే
• ఏపీలో వనరులు వినియోగించుకునేలా ఎం ఎస్ ఎం ఈ లకు అందుబాటులోకి తెచ్చాం
• ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీలు తీసుకువచ్చాం
• ఈ సమ్మిట్ ద్వారా స్టార్టప్‌లు, పారిశ్రామిక యూనిట్లు, నిపుణులు, బ్యాంకులు ఒకే వేదిక పైకి వచ్చాయి.
• వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలి
• రూ.500 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలు కూడా ఇప్పటికే విడుదల చేశాం
• రూ.200 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభిస్తున్నాం
• ప్రతీ నియోజకవర్గంలో ఒక ఏంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
• ఇవాళ శంకుస్థాపన చేసిన 38 పార్కులతో పాటు వంద పార్కులకు ఇప్పటికే శంకుస్థాపన చేశాం
• ఎలాంటి వివాధాలు లేకుండా ఈ పారిశ్రామిక పార్కులకు భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు
• ప్రైవేటు పారిశ్రామిక పార్కుల కు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం
• శ్రీసిటీ విజయవంతమైన పారిశ్రామిక పార్క్
• రూ.28 వేల కోట్ల కార్పస్ ఫండ్ డ్వాక్రా మహిళల సంఘాల వద్ద ఉంది
• ఈ ఏడాది 5 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలను ఎంటర్ ప్రెన్యుర్లు గా మారుస్తాం
• రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం
• ఏపీ నుంచి వంద యునికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం
• వచ్చేది నాలెడ్జ్ ఎకానమీ దీనిని అందిపుచ్చుకోవాలి
• విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ అనేది మా ప్రభుత్వ నినాదం
• ఒక పరిశ్రమ వ్యర్థాలు మరో పరిశ్రమకు ముడి సరుకు గా మారుతుంది
• సర్క్యులర్ ఎకానమీ వ్యవస్థ, ఎంఎస్ఎంఈ ఎకో సిస్టమ్ తయారు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

• మెటా, అమెజాన్, జోహో లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం
• స్పేస్, డిఫెన్స్, ఏరో స్పేస్ లాంటి రంగాల్లో ఎంఎస్ఎంఈలు కీలకంగా మారాలి
• అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం లాంటి టెక్నాలజీని యువత, విద్యా సంస్థలు ఉపయోగించుకోవాలి
• అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుంది. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు కూడా ఇక్కడ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం
• జెన్ జీ, జెన్ ఆల్ఫా, టీనేజర్లకు ఎలాంటి అవకాశాలు కావాలో చెబితే దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది
• టెక్నాలజీతో అనుసంధానం చేసుకుని జెట్ స్పీడ్ తో అభివృద్ధిలో ముందుకు వెళ్లాలి
• టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికత కూడా ముఖ్యమే
• మూడు రీజియన్లుగా ఏపీని అభివృద్ధి చేస్తున్నాం
• ప్రపంచానికే డేటా సెంటర్‌గా విశాఖను అభివృద్ధి చేస్తున్నాం
• స్టీల్ సిటీ, అల్యూమినియం, రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి కీలకమైన పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి
• పుట్టపర్తి నుంచి బెంగుళూరు వరకూ డిఫెన్స్ కారిడార్‌గా మారుతుంది
• 36 రోజుల్లోనే 5 జనరేషన్ ఫైటర్ జెట్ యుద్ధ విమానం తయారీ టెస్టింగ్ ఫెసిలిటీ రాయల సీమ లో ఏర్పాటు అవుతుంది
• రూ.40 వేల కోట్లతో ఉద్యాన హబ్‌గా రాయలసీమను తయారు చేస్తున్నాం
• సూర్యలంక అత్యుత్తమ బీచ్ గా మారుస్తున్నాం, గ్రాండ్ కాన్యాన్ గా గండికోట లాంటి ప్రాంతాలు ఉన్నాయి.
• ఇలా ప్రతీ అంశంలోనూ పెట్టుబడులకు ఆస్కారం ఉంది
• నెలకు రూ.లక్ష కోట్ల చొప్పున 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
• చిప్ టు షిప్ అన్నది ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా మాన్యుఫాక్చరింగ్పై దృష్టి సారించాము
• కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాదు పరిశ్రమలు గ్రౌండ్ చేసేలా చూస్తున్నాం
• సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ అన్నది మా ప్రభుత్వ విధానం
• అంబేద్కర్ కళావేదిక లాంటి కన్వెన్షన్ సెంటర్లను రాష్ట్రంలో మరో ఐదింటిని నిర్మిస్తాం







