రాజమండ్రిని షేక్ చేసిన పవన్ టూర్..!
రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు జీవనాధారమైన నదులను కలుషితం చేస్తూ చంపవద్దని, గోదావరి, కృష్ణా నదులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. నదుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 6 నెలల్లో నదుల స్వచ్ఛతలో స్పష్టమైన మార్పు కనిపించాలని, ఇందుకోసం ఈ రోజు నుంచే యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని పవన్ కల్యాణ్ స్పష్టం చ్చేసారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల్లో పుష్కరాల పనులు ఆశించిన రీతిలో జరగడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పనులకు సంబంధించిన డీపీఆర్‌లు (Detailed Project Reports), స్పష్టమైన ప్రణాళికలు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంపై అధికారులను తప్పుపట్టారు. “ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది.. ఇంత తక్కువ కాలంలో పుష్కరాల పనులన్నీ ఎలా పూర్తి చేస్తారు?” అని జిల్లా కలెక్టర్‌ను పవన్ కల్యాణ్ నేరుగా ప్రశ్నించారు.
సమయం తక్కువగా ఉందని తొందరపాటుతో నాసిరకం పనులు చేస్తే సహించేది లేదని అధికారులను డిప్యూటీ సీఎం హెచ్చరించారు. నాసిరకం నిర్మాణాల వల్ల భవిష్యత్తులో ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పుష్కరాల వంటి ప్రతిష్టాత్మక వేడుకల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా పనులను వేగవంతం చేయాలని పవన్ కల్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి







