సమంత సినిమాకు జన నాయకుడి టెన్షన్
చాలా విరామం తర్వాత సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) నటిస్తున్న మా ఇంటి బంగారంపై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ నందినీ రెడ్డి(Nandini Reddy) రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాను మొదట మే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ల కారణంగా మూవీని జూన్ 19కి మార్చాల్సి వచ్చింది. అంతకుముందు జూన్ 4 డేట్‌ను కూడా పరిశీలించినప్పటికీ, పెద్ది(Peddi) అదే తేదీని లాక్ చేసుకోవడంతో టీమ్ వెనక్కి తగ్గింది. ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్‌పై అనిశ్చితి నెలకొనడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
కోలీవుడ్ స్టార్ దలపతి విజయ్(Vijay) నటించిన జన నాయగన్(Jana Nayagan) కూడా జూన్ 19 విడుదలకు సిద్ధమవుతోందన్న వార్త ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చిత్ర మేకర్స్ నుంచి ఈ సినిమా రిలీజ్ పై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా, ఇప్పటికే సెన్సార్ పూర్తై రిలీజ్ కు మార్గం సుగమమైందని చెన్నై వర్గాలు చెబుతున్నాయి.
అదే ఇప్పుడు మా ఇంటి బంగారం టీమ్‌కు కొత్త టెన్షన్‌గా మారింది. ముఖ్యంగా తమిళ వెర్షన్ విడుదలను ప్లాన్ చేస్తే థియేటర్ల విషయంలో తీవ్ర పోటీ తప్పదని భావిస్తున్నారు. విజయ్ చేస్తున్న చివరి సినిమా కావడంతో జన నాయగన్ పై కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి సమయంలో అదే తేదీన సమంత సినిమా రావడం రిస్క్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ స్టార్ సినిమాతో మా ఇంటి బంగారం నిలబడగలదా అన్న చర్చ సాగుతోంది. మరి మేకర్స్ కంటెంట్ పై నమ్మకంతో ముందుకు వెళ్తారా లేదా మరోసారి వాయిదా వేస్తారా అన్నది చూడాలి.







