ప్రభాస్ స్పిరిట్ పై ‘స్పెషల్’ అప్డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో స్పిరిట్ ఇప్పటికే టాప్‌లో నిలిచింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సినిమాను కేవలం యాక్షన్ డ్రామాగా కాకుండా స్టైలిష్ మాస్ యూనివర్స్‌గా తీర్చిదిద్దుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న స్పెషల్ సాంగ్ అప్డేట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ – త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ పాటను ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది. ముఖ్యంగా ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న భారీ సెట్, హైఎండ్ విజువల్ డిజైన్, మాస్ ఎలివేషన్స్ ఇప్పుడు అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఇవి కూడా చదవండి
ఇప్పటికే స్పిరిట్‌లో ప్రభాస్ లుక్ పూర్తిగా వైల్డ్ అండ్ రగ్గడ్ మాస్ అవతార్‌లో ఉండబోతుందని టాక్ నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే ఈ స్పెషల్ సాంగ్‌ను కూడా మామూలు కమర్షియల్ నెంబర్లా కాకుండా కథలో కీలక మలుపు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సాంగ్‌లో విజువల్స్, కెమెరా వర్క్, స్టైలింగ్, సెట్స్ అన్నీ అంతర్జాతీయ ప్రమాణాల్లో ఉండనున్నాయని సమాచారం. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో ఎమోషన్స్‌కే కాకుండా మ్యూజిక్కు కూడా ప్రత్యేకమైన స్థానం ఉండటంతో ఈ సాంగ్‌పై మరింత ఆసక్తి పెరుగుతోంది.
మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్థన్ రామేశ్వర్(Harshavardhan Rameshwar) ఇప్పటికే డైరెక్టర్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సాంగ్ కేవలం గ్లామర్ కోసం కాకుండా సినిమా హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ఎలిమెంట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ సిరీస్(T-Series) మరియు భద్రకాళి పిక్చర్స్(Bhadrakali Pictures) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, కథా పరంగా కూడా పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వబోతుందనే టాక్ నడుస్తోంది. ఇదే ఊపులో ఈ స్పెషల్ సాంగ్ నిజంగానే ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ స్పెషల్ సాంగ్‌గా నిలుస్తుందా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరందుకుంది.
ఇవి కూడా చదవండి







