పెట్రోల్ దోపిడీపై వైఎస్ షర్మిల ఫైర్.. వ్యాట్, రోడ్ సెస్ రద్దుచేయాలి..!
ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరల పేరుతో సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి(Ys Sharmila) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో(Vijayawada) మీడియాతో మాట్లాడిన ఆమె, దేశ ప్రజల సంపాదనను కాజేయడంలో మోదీని మించిన లూటీదారు ఎవరూ లేరని ధ్వజమెత్తారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే వరుసగా నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం అత్యంత దారుణమని, రోజుకు వెయ్యి కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపుతున్నా కేంద్ర ప్రభుత్వ ఆకలి తీరడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామాన్యులను రోడ్డున పడేసి, ప్రజల బతుకులను భారం చేసే కుట్ర ఇందులో దాగుందని ఆమె ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ సంక్షోభ సమయాలను ఎదుర్కొన్న తీరును ఈ సందర్భంగా షర్మిల గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ప్రజలపై మొత్తం భారం పడకుండా మన్మోహన్ సింగ్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. పెరిగిన భారాన్ని మూడు భాగాలుగా విభజించి.. ఒక భాగాన్ని ప్రభుత్వం, రెండో భాగాన్ని ఆయిల్ కంపెనీలు భరించేలా చేసి, మూడో భాగాన్ని మాత్రమే అత్యంత తక్కువగా ప్రజలపై వేశారని వివరించారు.
కానీ నేడు నష్టాల పేరు చెప్పి మొత్తం భారాన్ని సామాన్యులపై రుద్దడం మోదీ దుర్మార్గపు పాలనకు నిదర్శనమని, ధరలు తగ్గినప్పుడు లాభాలు పొంది, పెరిగినప్పుడు జనాలను వాయించడం కేంద్ర ప్రభుత్వ నీచపు చర్య అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నాలుగోసారి పెంచిన ధరలతో ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.19 పైసలకు, డీజిల్ లీటర్ ధర రూ. 104.88 పైసలకు చేరిందని షర్మిల వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలోనే ఇంధన ధరలు ఉండటం దారుణమన్నారు.
రాష్ట్ర ప్రజలపై మోడీ సర్కార్ భరించలేని భారం మోపుతుంటే, మిత్రపక్షంగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మౌనం వహించడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ధరలు తగ్గించాల్సింది పోయి, వ్యాట్ (VAT) భారాన్ని తగ్గించాలన్నా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు కొంతైనా ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ క్రింది చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి







