Spirit: ప్రభాస్ స్టెప్పులతో పాటూ త్రిప్తి గ్లామర్ కూడా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) హీరోగా రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌లలో స్పిరిట్(spirit) ఒకటి. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. పవర్ఫుల్ పోలీసాఫీసర్ కథాంశంతో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి(Tripti Dimri) హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతుండగా, తాజా షెడ్యూల్లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ఈ యాక్షన్ షెడ్యూల్ పూర్తైన వెంటనే ఓ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ పాటలో ప్రభాస్ స్టైలిష్ స్టెప్స్‌తో పాటుగా, త్రిప్తి డిమ్రి గ్లామర్ మెయిన్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. భారీ సెట్స్‌లో ఈ సాంగ్ ను గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లో ప్రభాస్ రఫ్ అండ్ వైల్డ్ లుక్ అభిమానులను ఆకట్టుకోవడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ఇక ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్(harshavardhan rameswar) తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. భారీ నిర్మాణ విలువలతో టీసిరీస్(T Series) తో పాటూ భద్రకాళి పిక్చర్స్(Badrakali Pictures) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులకు మరో కొత్త అనుభూతిని అందించేలా ఈ సినిమా రూపొందుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.







