King: కింగ్ కోసం రూ.400 కోట్లు?
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(shah rukh khan) పఠాన్(Pathan), జవాన్(jawaan) సినిమాలతో మంచి హిట్లు అందుకోవడమే కాకుండా ఆ సినిమాలతో భారీ కలెక్షన్లు కూడా సాధించారు. అయితే డంకీ(dunky) మూవీతో కాస్త నెమ్మదించిన షారుఖ్, ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. షారుఖ్ తన నెక్ట్స్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్(siddharth Anand) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.
కింగ్(King) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీ నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజవగా ఆ టీజర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాకుండా నెట్టింట ట్రెండింగ్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా బడ్జెట్ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది. బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం కింగ్ బడ్జెట్ ఆల్రెడీ రూ.400 కోట్లు దాటిందట.
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్(red chillies entertainments) బ్యానర్ లో గౌరీ ఖాన్(Gouri khan) ఈ మూవీని నిర్మిస్తుండగా, కింగ్ మూవీ యాక్షన్ సీన్స్ కోసం మేకర్స్ హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపారని తెలుస్తోంది. కింగ్ మూవీలోని ఫుటేజ్ చూసిన వారు సినిమా గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో షారుఖ్- సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో పఠాన్ రాగా, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు కింగ్ మూవీతో పఠాన్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేయాలని వారు ట్రై చేస్తున్నారట.







