Revanth Reddy: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) భేటీ అయ్యారు. ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ (Gandhi Sarovar Project) శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్రమంత్రిని సీఎం ఆహ్వానించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో దీన్ని చేపడుతున్నట్లు వివరించారు. మూసీ పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు.బాపూఘాట్ (Bapu Ghat) ను ప్రపంచ స్థాయి విద్య, సాంస్కతిక, ఆధ్మాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు రాజ్‌నాథ్‌కు రేవంత్ రెడ్డి వివరించారు.













