Revanth Reddy: ఆ కేసును అందుకే సీబీఐకిచ్చాం.. అరెస్ట్ ఎప్పుడు? : సీఎం రేవంత్ రెడ్డి
మాజీ సీఎం కేసీఆర్‌కు ఇద్దరు పుత్రులు ఉన్నారని, ఒకరు దొంగ పుత్రుడు కేసీఆర్ అని, మరొకరు దత్తపుత్రుడు కిషన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బర్దీపూర్ వద్ద నిర్వహించిన ప్రజా పాలన ప్రగతిబాట బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్‌రావుగా మారారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు జైలుకు వెళ్లకుండా ఆయనే కాపాడుతున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రాష్ట్ర బీజేపీ నేతలే చెప్పారని, ఆ కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో జైలుపు పంపుతామన్నారని తెలిపారు. కానీ, తాము ఆ కేసును సీబీఐకి అప్పగించి ఆరు నెలలు దాటుతున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కేసీఆర్, హరీశ్‌రావును జైలుకు పంపాలంటూ ఎంపీ అరవింద్ సవాల్ చేశారని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ల తలలు వేరైనా, శరీరం ఒక్కటేనని, వారు వీణ వాణిలాగా ఒకే తల ఉన్న కవల పిల్లలని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడా దాక్నున్నారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలుసుకొని ఆయనను జనజీవన స్రవంతిలో కలపాలని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








