Minister Vakiti:ఎన్నికల భయంతో ఆయన ఆత్మహత్య … నాకెలాంటి సంబంధం లేదు
మక్తల్ లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప (Mahadevappa) ఆత్మహత్య విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై చేస్తున్న ఆరోపణలు రుజువైతే దేనికైనా సిద్ధమని చెప్పారు.మహదేవప్పకు నేను ఎప్పడూ కాల్ చేయలేదు. అవసరమైతే కాల్ డేటా (Call data)పరిశీలించండి. పోస్ట్మార్టం నివేదిక తర్వాతే అసలు కారణాలు వెల్లడవుతాయి. ఎన్నికల భయంతో ఆయన మతి చెందినట్లు కుటుంబసభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అని అన్నారు.













