Stock Market: పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. రూ.6 లక్షల కోట్ల లాభం!
పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణంతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్లు (Stock Market).. గురువారం అనూహ్యంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో మదుపర్ల సెంటిమెంట్ బలపడటంతో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.
మార్కెట్ల కదలికలకు కారణం..
వాణిజ్య నౌకల రాకపోకలకు కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ గుండా వెళ్లే నౌకలకు తక్కువ ధరకే బీమా కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మార్కెట్లకు (Stock Market) గట్టి ఊరటనిచ్చింది. అవసరమైతే చమురు ట్యాంకర్లకు అమెరికా నౌకాదళం (US Navy) ఎస్కార్ట్‌గా భద్రత కల్పిస్తుందన్న ఆయన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో భయాలను పోగొట్టాయి.
ఇవి కూడా చదవండి
అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ (CIA)తో జరిగిన చర్చల్లో.. తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను నిలిపివేసేందుకు ఇరాన్ అంగీకరించిందన్న వార్తలు మార్కెట్లలో (Stock Market) ఉత్సాహాన్ని నింపాయి. ఆ తర్వాత ఇరాన్ ఈ వార్తలను అధికారికంగా ఖండించినప్పటికీ, అప్పటికే మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లకు పైగా ఎగబాకడం గమనార్హం. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగకపోవచ్చన్న అంచనాలతో ఆసియా, గ్లోబల్ మార్కెట్లు (Stock Market) కూడా లాభాల బాట పట్టాయి.
రూ. 6 లక్షల కోట్లు పెరిగిన సంపద!
ఈ సానుకూల పరిణామాలతో గురువారం ఒక్కరోజే దలాల్ స్ట్రీట్‌లో (Stock Market) మదుపర్ల సంపద సుమారు రూ. 6 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈ (BSE) మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.452.96 లక్షల కోట్లకు చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి కీలక సూచీల వివరాలు ఇలా ఉన్నాయి:
సెన్సెక్స్: 899.71 పాయింట్లు లాభపడి 80,015 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ: 285.40 పాయింట్లు ఎగబాకి 24,765 వద్ద ముగిసింది.
కరెన్సీ: అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రూ. 91.64 వద్ద కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి







